News November 19, 2025
నయనతారకు రూ.10 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన భర్త

నయనతార బర్త్‌డే (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్‌ఎస్ 600ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
Similar News
News March 11, 2026
మార్చి 15 నుంచి భారీ వర్షాలు: వాతావరణ నిపుణులు

TG: మార్చి 15 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తొలుత ఉత్తర, మధ్య తెలంగాణలో వానలు పడతాయని పేర్కొన్నారు. మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా వడగళ్ల వర్షాలతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని హెచ్చరించారు.
News March 11, 2026
మహేశ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ హరీశ్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ సందర్భంగా ఓ పవన్ అభిమాని ‘BoB రికార్డులు లేచిపోవాలి’ అని చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ హరీశ్ ‘తథాస్తు’ అని రిప్లై ఇవ్వడం వివాదాస్పదమైంది. మహేశ్‌ను BoB (బాస్ ఆఫ్ బ్లాక్‌బస్టర్స్)గా పిలుచుకునే ఫ్యాన్స్ హరీశ్‌పై ఫైరవుతున్నారు. కాగా పని ఒత్తిడిలో తెలియక జరిగిన పొరపాటని హరీశ్ సారీ చెప్పారు. తనకు మహేశ్ అంటే ఎంతో గౌరవమని, రాజమౌళి మూవీతో రికార్డులన్నీ తిరగరాస్తారని ట్వీట్ చేశారు.
News March 11, 2026
ప్రాపర్టీ కొంటున్నారా? ఈ సర్టిఫికెట్లు చూసుకోండి

*టైటిల్ డీడ్: విక్రయదారుడికి అమ్మే ఆస్తిపై హక్కులు ఉన్నట్లు నిరూపిస్తుంది.
*మదర్ డీడ్: సదరు ల్యాండ్ ఓనర్షిప్ హిస్టరీ తెలుసుకోవచ్చు.
*ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC): లోన్లు, లీగల్‌గా క్లియర్‌గా ఉన్నట్లు నిర్ధారిస్తుంది
*NALA కన్వర్షన్ సర్టిఫికెట్: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసినట్లు తేలుస్తుంది. *పట్టా సర్టిఫికెట్: ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీని చూపిస్తుంది.


