News November 19, 2025

HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.

Similar News

News March 14, 2026

సిద్దిపేట: ఉత్తమ పట్టు రైతులకు ఉత్తమ అవార్డులు

image

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన ‘పట్టు కృషి మేళా’లో సిద్దిపేట జిల్లా రైతులు మెరిశారు. పట్టు సాగులో ప్రతిభ కనబరిచిన పిల్లి సునీత-శ్రీనివాస్, బొగ్గుల వనజ-నర్సింలు, రాగుల లక్ష్మీ-రాజు, ఇరుకొండ వాణి-నారాయణరెడ్డికి జిల్లాస్థాయి అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టు పరిశోధన సంస్థ ప్రతినిధులు వారిని శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. రైతుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

News March 14, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 14)

image

1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం (ఫొటోలో)
1883: తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త కారల్ మార్క్స్ మరణం
1917: సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ జననం
1931: భారత్‌లో తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’ విడుదల
1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
2008: శంషాబాద్ విమానాశ్రయ ప్రారంభోత్సవం
2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
* అంతర్జాతీయ గణిత దినోత్సవం

News March 14, 2026

MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

image

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.