News November 19, 2025

రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.

Similar News

News March 4, 2026

24,800 మంది బోగస్ ఉద్యోగులు… జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు

image

TG: GOVTలో దాదాపు 3.70L మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారని, వారిలో 24,800 మంది బోగస్ ఉద్యోగులేనని మాజీ CS శాంతి కుమారి కమిటీ తేల్చింది. ఇంకా 14 శాఖల వివరాలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. బ్యాంకుఖాతా, పాన్, ఆధార్ లేకుండానే 10 ఏళ్లకు పైగా జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు ఇస్తున్నారు. ఈ రిపోర్టు CMకు అందగా, వారి జీతాల చెల్లింపును నిలిపేయాలని ఆయన ఆదేశించారు.

News March 4, 2026

ధర్మవరం: ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

image

ధర్మవరం పట్టణం నేసేపేటకు చెందిన హర్జే నాయక్ (52) బుధవారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య నాగలక్ష్మి బాయితో గొడవపడి మనస్తాపం చెందడం వల్ల ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు రామగిరి మండలం కొండాపురం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 4, 2026

సిద్దిపేట: షార్ట్ వీడియో విజేతలకు కూపన్లు అందజేత

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన షార్ట్ వీడియో పోటీల విజేతలకు సీపీ రష్మీ పెరుమాళ్ బహుమతులు అందజేశారు. ప్రముఖ వినోద సంస్థ ‘వండర్లా’ ఉచిత ప్రవేశ కూపన్లను స్పాన్సర్ చేయగా, వాటిని విజేతలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0’ను ప్రారంభిస్తూ.. సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన వీడియోలు రూపొందించి యువత భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు.