News November 19, 2025

రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.

Similar News

News March 25, 2026

ఆముదం సాగుకు అనువైన సూటి రకాలు

image

☛ హరిత: పంట కాలం 130-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ☛ జ్వాల: పంట కాలం 90-180 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, బూజు తెగులును తట్టుకుంటుంది.
☛ DDS-107: పంట కాలం 100-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకుంటుంది.
☛ ప్రగతి: పంట కాలం 120-140 రోజులు. దిగుబడి ఎకరాకు 6- 7 క్వింటాళ్లు.

News March 25, 2026

రెండుగా విడిపోనున్న ‘కరీంనగర్’..?

image

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం KNR, KNR రూరల్, కొత్తపల్లి మండలాలతో ఒక నియోజకవర్గంగా ఉంది. KNR మండలాన్ని ఒక నియోజకవర్గంగా, కొత్తపల్లి, KNR రూరల్ మండలం కలిపి మరో నియోజకవర్గమయ్యే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

News March 25, 2026

నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.