News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 18, 2026

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

image

TG: మూసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. మూసీ గురించి సభలో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని KTR మండిపడ్డారు. సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ ఆ పార్టీ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. అయితే BRSకు మూసీ ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే వారికి లేదన్నారు.

News March 18, 2026

VZM: గంజాయి పట్టివేత.. కానిస్టేబుళ్ల అరెస్ట్

image

గంజాయి తరలిస్తున్న ఐదుగురిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో VZM జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. కారులో 10 కేజీల గంజాయి తరలిస్తుండగా భీమిలి పరిధి దాకమర్రికి సమీపంలో వీరిని అరెస్ట్ చేశామన్నారు. కానిస్టేబుళ్లు శివప్రసాద్(ఎస్. కోట), వి.రాంబాబు (వేపాడ), ఇ.సతీశ్(కొత్తవలస) స్టేషన్లకు చెందిన వారిగా మిగిలిన వారిని పి.శివకృష్ట, జి.గోపిగా గుర్తించారు.

News March 18, 2026

NTR: అమరావతిలోనే ఇకపై ఆ శాఖ ఉద్యోగులకు శిక్షణ

image

పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే కేంద్రం రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ కేంద్రం ఏర్పాటుకై అమరావతిలోని కురగల్లులో 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ CRDA తాజాగా ఉత్తర్వులిచ్చింది. కాగా రాష్ట్ర విభజనకు ముందు HYDలోని మర్రి చెన్నారెడ్డి శిక్షణ కేంద్రంలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేవారు. ఈ కేంద్రం ఏర్పాటైతే అమరావతిలోనే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు.