News November 19, 2025
సొంత జిల్లాలోనే పరీక్షలు నిర్వహించాలి: టెట్ అభ్యర్థులు

గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జగిత్యాల జిల్లా టెట్ అభ్యర్థులకు కరీంనగర్‌లోనే సెంటర్ ఉండేది. మరి ఇప్పుడు సొంత జిల్లాలో కాకుండా ఖమ్మం, కొత్తగూడెం వంటి దూరప్రాంతాల్లో సెంటర్ పడటంతో అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల మూడు సెంటర్లు ఉండగా ఎక్కడో ఖమ్మంలో వేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు దీనిపై ఆలోచించాలని వారు కోరుతున్నారు.
Similar News
News March 16, 2026
విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వర్షం కురిసింది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, APలోని అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.
News March 16, 2026
కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.