News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News March 20, 2026
సంగారెడ్డి: మంజీరా నదిలో వేలాది చేపల మృత్యువాత

హత్నూర మండలం పల్పనూర్ శివారులోని మంజీరా నదిలో వేలాది చేపలు మృతి చెంది పైకి తేలడం స్థానికంగా కలకలం రేపింది. కలుషిత జలాల వల్లే చేపలు చనిపోయాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం డిమాండ్ చేశారు.
News March 20, 2026
‘అర్జీలను సత్వరం పరిష్కరించాలి’: శ్రీకాకుళం కలెక్టర్

దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ను కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమశాఖ, ఏడీబీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 20, 2026
MBNR: KGBV.. దరఖాస్తులు చేసుకోండి

KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CETకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3న జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు జేఈఈ, నీట్, క్లాట్, ఎప్ సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
SHARE IT


