News November 19, 2025

సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

image

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.

Similar News

News March 11, 2026

VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.

News March 11, 2026

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 24 రోజుల ముందే 78.464 మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16.5 శాతం వృద్ధి. ఈ చారిత్రాత్మక విజయం అని.. టీమ్ వాల్తేరును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. కస్టమర్ కేంద్రీకృత విధానాలు, సమన్వయంతోనే ఈ అసాధారణ మైలురాయి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2026

విశాఖ: ​మే నాటికి భోగాపురం రోడ్లు పూర్తి!

image

సీఎం ఆదేశాల మేరకు మే నెలాఖరుకల్లా భోగాపురం విమానాశ్రయ అనుసంధాన రహదారులను పూర్తి చేస్తామని VMRDA చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. ప్రస్తుతం 60% పనులు పూర్తయ్యాయని, నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులోగా వంద శాతం పనులు ముగించాలని అధికారులను ఆదేశించారు