News November 19, 2025
HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Similar News
News March 16, 2026
VZM: గ్యాస్ బుక్ చేశారా..ఐదు రోజుల్లోనే డెలివరీ

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన తర్వాత ఐదు రోజుల్లోగా డెలివరీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, మూడు గ్యాస్ కంపెనీలు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన వెల్లడించారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News March 16, 2026
నల్గొండ: ప్రజావాణికి పోటెత్తిన అర్జీలు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 105 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 60, ఇతర శాఖలకు 45 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 16, 2026
బాపట్ల ఎస్పీ కార్యాలయానికి 59 అర్జీలు

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 59 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పూర్తిస్థాయి విచారణ జరిపి సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


