News November 19, 2025
కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
పెరిగిన విమాన టికెట్ల ధరలు!

ఆయిల్ ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌లు విధించాలని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా వసూలు చేస్తుండగా, తాజాగా ఇండిగో కూడా పెంచింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి ₹425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో వెళ్తాయని తెలుస్తోంది. ఈమేరకు అంతర్గత చర్చలు జరుపుతున్నాయని, త్వరలో ధరలు ఖరారు చేస్తాయని సమాచారం.
News March 13, 2026
USతో ట్రేడ్ డీల్ నిలిపివేత వార్తలు.. భారత్ స్పందన!

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయంటూ భారత్, చైనా సహా 16 దేశాలపై <<19359537>>దర్యాప్తునకు<<>> ట్రంప్ ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో USతో ట్రేడ్ డీల్‌ను ఇండియా నిలిపేయనుందని Reuters తెలిపింది. ఒప్పందంపై సంతకం చేయకుండా కొన్ని నెలలు ఆలస్యం చేయనుందని పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, పరస్పర ప్రయోజనకర ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.
News March 13, 2026
7-8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా?

7-8 గంటలు పడుకున్నా ఉదయాన్నే నీరసంగా, తల భారంగా అనిపిస్తే అది కేవలం నిద్ర సమస్య కాకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D లోపం వల్ల ఎనర్జీ తగ్గి, కండరాల రికవరీ దెబ్బతింటుంది. దీంతో నిరంతరం అలసట, మూడ్ స్వింగ్స్, మెదడు మొద్దుబారడం వంటి సమస్యలొస్తాయి. సరైన ఆహారం, సూర్యరశ్మి, తగినంత నీరు తీసుకోవడంతో పాటు టెస్ట్‌లు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


