News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News March 6, 2026
అల్లూరి: వాట్సాప్‌లో టెన్త్ హాల్ టికెట్స్..

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు వాట్సాప్ నంబర్ 955230009కి హాయ్ అని మెస్సేజ్ పెట్టి హల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అల్లూరి DEO రామకృష్ణరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు సులభంగా హాల్ టికెట్లు చేరువ చేయడానికి ప్రభుత్వం మనమిత్ర యాప్‌లో హాల్ టికెట్లను పొందుపరిచిందన్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో 264 పాఠశాలల్లో 11,457 మంది టెన్త్ విద్యార్థులకు 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News March 6, 2026
ఖమ్మం: వేసవి దాహార్తి తీర్చేలా పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బావులు, బోర్లను పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల నీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిరుపయోగంగా ఉన్న 863 చేతి పంపులు, 20 మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది.
News March 6, 2026
తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


