News April 15, 2024

కాంగ్రెస్ పార్టీకి సీవీ శేషారెడ్డి రాజీనామా

image

పీసీసీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. అనుచరులతో సమావేశమై ఇకపై రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో ఉంటానన్నారు. సీవీ శేషారెడ్డి రెండు సార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు.

Similar News

News March 15, 2025

నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐ‌ఓ ధన్యవాదాలు తెలిపారు.

News March 15, 2025

నెల్లూరు: 174 పరీక్షా కేంద్రాలు.. 33,434 మంది విద్యార్థులు

image

సంగం జడ్పీ హైస్కూల్‌ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.

News March 15, 2025

రౌడీ షీటర్ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నెల్లూరు

image

నెల్లూరు నగరం పాత వేదయపాలెంకు చెందిన రౌడీ షీటర్ సృజన్ కృష్ణ (చింటూ)ను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో హత్య చేశారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించారు. హత్యకు గల కారణాలపై వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సాంకేతిక పరిశోధనతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!