News November 19, 2025
స్టార్టప్‌ల కోసం ₹1000Cr ఫండ్: IT స్పెషల్ CS

TG: స్టార్టప్‌ల కోసం ₹1000 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్‌పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
Similar News
News March 15, 2026
మోగిన ఎన్నికల నగారా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

తమిళనాడు, బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి(UT)లో ఎన్నికల నగారా మోగింది. 824 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. బెంగాల్‌లో అత్యధికంగా 294, TN-234, కేరళం-140, అస్సాం-126, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. 17.4 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 2.19లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.
News March 15, 2026
పుట్టా మహేశ్‌ను వదిలేసిన పోలీసులు

TG: డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన TDP MP పుట్టా మహేశ్‌ను శంషాబాద్ రూరల్ పోలీసులు వదిలిపెట్టారు. ఆయనతో పాటు ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మీద నోటీసులు ఇచ్చి పంపించేశారు. BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి(రోహిత్ రెడ్డి సోదరుడు), నమిత్‌ను ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కొకైన్ తీసుకుంటూ మహేశ్, రోహిత్ దొరికారు.
News March 15, 2026
4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది!

తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి (UT) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9న కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. వెస్ట్ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో, ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటి ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. 4 రాష్ట్రాలు సహా ఒక UTలో కలిపి 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.


