News November 19, 2025
VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్‌కు జిల్లా విద్యార్థులు

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్‌కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.
Similar News
News March 16, 2026
గుంటూరులో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు: DEO

గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO షేక్ సలీం బాషా తెలిపారు. మొత్తం 27,699 మంది విద్యార్థుల్లో 27,123 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా నోడల్ అధికారి పార్వతి 5 కేంద్రాలు, డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి మంగళగిరిలో ఒక కేంద్రం, డీఈఓ సలీం బాషా 8 కేంద్రాలు పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 38 కేంద్రాలు, రాష్ట్ర పరిశీలకులు 12 కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
News March 16, 2026
ఖమ్మం: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. 2 రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల్లో క్రియాటినిన్ స్థాయి పెరగడం, గతంలో 2 సార్లు గుండెపోటు రావడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయనను సోమవారం క్యాజువాలిటీకి తరలించారు.
News March 16, 2026
కామారెడ్డి: DEOకు ఉపాధ్యాయ సంఘాల వినతి

నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్‌పల్లి ZPHSలో ఉపాధ్యాయుడిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో DEO రాజుకు వినతిపత్రం అందజేశారు. అలాగే 2025లో SEEP సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు గౌరవ వేతనం చెల్లించాలని, జనగణన-2026లో SGTలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యాల సంతోష్, రాజ్ కుమార్ తదితరులున్నారు.


