News November 19, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలిలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,116, కనిష్ఠ ధర రూ.1,827, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.2,121, కనిష్ఠ ధర రూ.1,900, వరి ధాన్యం(HMT) గరిష్ఠ ధర రూ.2,200, కనిష్ఠ ధర రూ.2,150, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,891, కనిష్ఠ ధర రూ.2,081గా పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News April 4, 2026

అమ్రాబాద్ : రుసుల చెరువులో అరుదైన ‘దువ్వెన బాతు’ సందడి

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని రుసుల చెరువులో అరుదుగా కనిపించే ‘దువ్వెన బాతు’ సందడి చేస్తోంది. ముక్కుపై ఉండే ప్రత్యేక ముద్దుతో గుర్తింపు పొందే ఈ పక్షి సాధారణంగా కుంటలు, చెరువులు,నదుల వద్ద సంచరిస్తుంది. చిన్న చేపలు, కీటకాలు, నీటి విత్తనాలు దీని ఆహారం. ఈ పక్షి దర్శనం జీవ వైవిధ్యానికి సంకేతంగా భావిస్తున్నారు. రుసుల చెరువు పరిసరాలు వన్యప్రాణులకు అనుకూలంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

News April 4, 2026

రోడ్లపై కుప్పలు.. వాహనదారులకు తిప్పలు

image

నల్గొండ జిల్లాలో యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. కల్లాలు లేకపోవడంతో రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. జిల్లాలో 6.20 లక్షల ఎకరాల్లో సాగైన వరిలో ఇప్పటికే సగం కోతలు పూర్తయ్యాయి. రైతులు రోడ్లపై కుప్పలుగా ధాన్యం పోసి వాటి చుట్టూ రక్షణగా బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో ఇవి సరిగ్గా కనిపించక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలి.

News April 4, 2026

పార్వతీపురం మన్యం జిల్లాకు నాలుగేళ్లు

image

పార్వతీపురం మన్యం జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2022 ఏప్రిల్ 4న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాగాలతో పార్వతీపురం ప్రధాన పరిపాలనా కేంద్రంగా 4 నియోజకవర్గాలతో దీనిని ఏర్పాటు చేశారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏలు జిల్లాలో ఉన్నాయి. తోటపల్లి బ్యారేజీ, అడలి వ్యూ పాయింట్, దలైవలస తదితరవి ప్రసిద్ధి. మరి ఈ నాలుగేళ్లలో జిల్లా అభివృద్ధిపై మీ కామెంట్.