News November 19, 2025

ప్రయాణాలు చేయొద్దని గిల్‌కు డాక్టర్ల సూచన: క్రీడా వర్గాలు

image

మెడ నొప్పితో బాధపడుతున్న టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ నెల 22 నుంచి SAతో జరిగే రెండో టెస్టులో ఆడే అవకాశాలు కనిపించట్లేదు. ప్రయాణాలు చేయొద్దని ఆయనకు మెడికల్ టీమ్ సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ట్రావెల్ చేస్తే గాయం తీవ్రత పెరిగి, దీర్ఘకాలిక సమస్యగా మారొచ్చని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. రెండో టెస్టులో గిల్‌ను ఆడించాలా వద్దా అనే దానిపై ఈనెల 21న నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Similar News

News March 20, 2026

గోవాలో IEMDST-2026 సదస్సు

image

గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Goa) ఆధ్వర్యంలో జూన్ 8, 9 తేదీల్లో “IEMDST-2026” అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు NIT వరంగల్ ఫిజిక్స్ విభాగంతో కలిసి నిర్వహిస్తున్నారు. సస్టైనబుల్ టెక్నాలజీలకు సంబంధించిన మెటీరియల్స్, డివైసెస్‌పై పరిశోధనలు ప్రదర్శించే వేదికగా ఇది నిలుస్తుంది. దేశ, విదేశాల శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు.

News March 20, 2026

2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

image

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.

News March 20, 2026

‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

image

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.