News November 19, 2025
ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..

చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి త్వరగా రోగాల బారిన పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలంటే కొన్ని ఫ్రూట్స్ డైట్‌లో యాడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. నారింజ, యాపిల్, దానిమ్మ, కివీ తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వీటితో పాటు శరీరానికి తగినంత విటమిన్-డీ లభించేలా చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో వేడినీరు, జావలు, సూప్‌లు తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
Similar News
News March 7, 2026
650 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

RBIలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికే రేపే చివరి తేదీ. 50% మార్కులతో డిగ్రీ పాసై, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారు అర్హులు. వయోపరిమితి 20-28 ఏళ్లు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://rbi.org.in./
News March 7, 2026
అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.
News March 7, 2026
ఈ కలర్ క్లాత్స్‌తో సమ్మర్‌లో హాయ్ హాయ్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు కొన్ని రంగుల దుస్తులకు ప్రయారిటీ ఇస్తే శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రే, సాఫ్ట్ పింక్, పేల్ గ్రీన్, లావెండర్, పౌడర్ బ్లూ, క్రీమ్ తదితర రంగుల దుస్తులు వాడాలని సూచిస్తున్నారు. ఇవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి తక్కువ వేడిని గ్రహిస్తాయి. అలాగే చెమటను త్వరగా ఆరేలా చేస్తాయి.


