News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News March 21, 2026

కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

image

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.

News March 21, 2026

భద్రాద్రికి బడ్జెట్ ‘భరోసా’.. బీమా, విద్యార్థులకు వరం

image

బడ్జెట్‌లో జిల్లాకు ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది. రేషన్ కార్డు కలిగిన 3,22,738 కుటుంబాలకు ‘ఇందిరమ్మ జీవిత బీమా’ కింద రూ.5 లక్షల చొప్పున భద్రత కల్పించనున్నారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇంటర్ చదువుతున్న 4,300 మందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ATCల్లో శిక్షణ పొందుతున్న 688 మందికి నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందనుంది.

News March 21, 2026

MBNR: డిగ్రీ పరీక్ష ఫీజుకు వారం గడువు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (BSC, BZC, BA) 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 28తో గడువు ముగియనుంది. విద్యార్థులు సకాలంలో కాలేజీ వెబ్‌సైట్లలో ఫీజు చెల్లించి పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు అవకాశం ఉంది.