News November 19, 2025
iBOMMA బంద్.. ఇక కలెక్షన్లు పెరుగుతాయా?

iBOMMA క్లోజవడంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగిందని, ఇకపై తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే పైరసీ ఆగినందున మూవీల కలెక్షన్లు పెరుగుతాయా? అనే చర్చ మొదలైంది. సినిమాల్లో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకే వెళ్తారని, ఇది ఎన్నోసార్లు రుజువైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. కలెక్షన్లపై పైరసీ ప్రభావం నామమాత్రమేనంటున్నారు. మీరేమంటారు?
Similar News
News March 19, 2026
CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.
News March 19, 2026
ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.
News March 19, 2026
ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


