News April 15, 2024
ఇండిగో సంస్థ నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం

అయోధ్య నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణికులకు తాజాగా భయానక అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మరో పావుగంటలో ఢిల్లీ చేరుతుందనగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని చండీగఢ్‌కు మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత విమానంలో మరో ఒకట్రెండు నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందన్న విషయం ప్రయాణికులకు తెలిసింది. దీంతో వారంతా వణికిపోయారు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ DGCAకి ఫిర్యాదు చేశారు.
Similar News
News April 18, 2026
చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

మెదక్‌లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.
News April 18, 2026
IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.
News April 18, 2026
SRHలోకి సౌతాఫ్రికా పేసర్

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.


