News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News March 16, 2026
రెండేళ్లలో అద్భుత ప్రగతి: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండేళ్ల పాలన ప్రజారంజకంగా సాగుతోందని యెన్నెం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీనివల్ల మహిళలకు రూ. 9,200 కోట్లు ఆదా అయ్యాయని ఆయన వెల్లడించారు.
News March 16, 2026
GNT: బీటెక్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ నెలలో జరిగిన బీటెక్ 3/4 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం తెలిపారు. రీవాల్యుయేషన్, ఫీజు చెల్లింపు, తదితర పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.
News March 16, 2026
అనకాపల్లి: పీజీఆర్ఎస్‌కు 145 అర్జీలు

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 145, రెవెన్యూ క్లినిక్‌కు 169 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి వారితో మాట్లాడారు. పీజీఆర్ఎస్‌లో తమ దృష్టికి వచ్చిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


