News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News March 4, 2026
యుద్ధం.. 1,097 మంది ఇరానియన్లు మృతి

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 1,097 మంది పౌరులు చనిపోయినట్లు USకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వీరిలో 10 ఏళ్లలోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు తెలిపింది. లెక్కలోకి రాని మృతులు, గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుందని పేర్కొంది. కాగా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై US అటాక్ చేస్తుండగా, ఇజ్రాయెల్‌తోపాటు ఇరాక్, కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తోంది.
News March 4, 2026
ఏపీ నుంచి పారిశ్రామికవేత్తల పలాయనం: వైసీపీ

కూటమి ప్రభుత్వ వేధింపులు, వసూళ్లతో పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్తున్నారని వైసీపీ ధ్వజమెత్తింది. తిమ్మసముద్రంలో రక్షణ రంగ పరికరాల తయారీకి కేటాయించిన 121.53 ఎకరాల భూమిని గిన్‌ఫ్రా సంస్థ వెనక్కి ఇచ్చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. చంద్రబాబు పాలనలో కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న కంపెనీలు కూడా తరలిపోతున్నాయని విమర్శించింది. దీనివల్ల యువత ఉపాధి కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
News March 4, 2026
ADB: పెళ్లిళ్లలో కట్న కానుకల నిషేధం.. ఏకమైన గ్రామస్థులు

గ్రామస్థుల ఐక్యత ఒకరికి ఆసరా అయ్యింది. ఇంద్రవెల్లి మండలం దోడంద గ్రామంలో పెళ్లిళ్లలో కట్న కానుకలు నిషేధించడంతో గ్రామస్థులంతా తోచినంత పొదుపు చేసుకుని ఇటీవల నిశ్చితార్థమైంది. కొడప రేణుక కుటుంబానికి గ్రామస్థులంతా కలిసి రూ. 21,000 వేల ఆర్థిక సహాయంగా అందజేసినట్లు గ్రామ పటేల్ తుంరం మల్కు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.


