News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 8, 2026

యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

image

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.

News March 8, 2026

వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

image

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.

News March 8, 2026

గో బ్యాక్ చంద్రబాబు.. హామీల అమలేది?

image

ఈనెల 9న CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో డోన్ నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. డోన్‌లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు, డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడం, జలదుర్గం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడం, హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులను నింపడం వంటి హామీలు గుప్పించారు. వాటిని నెరవేర్చాలని ప్రజలు కోరుతుండగా, వామపక్షాలు గో బ్యాక్ చంద్రబాబు అంటున్నాయి.