News November 19, 2025

VKB: డీసీసీ పీఠం రఘువీరారెడ్డికి దక్కేనా.!

image

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన అతనిని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. BRS పాలనలో జిల్లాను ప్రతిపక్షం‌లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడని రఘువీరా రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పలువురు నాయకులు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Similar News

News March 20, 2026

శనగ రైతుకు కష్టాలు.. ఆదు‘కొనేదెవరు’?

image

AP: విదేశీ శనగల దిగుమతి సుంకాన్ని కేంద్రం 10 శాతానికి తగ్గించడం, దేశీయ శనగల కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. ఈ సీజన్‌లో 8L టన్నుల ఉత్పత్తి రానుండగా 94,500 మె.టన్నుల కొనుగోలుకే కేంద్రం అనుమతించింది. మద్దతు ధర క్వింటాకు రూ.5,875 ప్రకటించగా, వ్యాపారులు రూ.5,000-5,500కు మించి కొనడం లేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

News March 20, 2026

పుట్టపర్తి విమానాశ్రయ భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో పటిష్ఠమైన భద్రత కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, విమానాశ్రయ నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం విమానాశ్రయ భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రతాపరమైన సమస్యలు ఎదురైనప్పుడు అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. విమానాశ్రయ రక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదన్నారు.

News March 20, 2026

రాజీవ్ యువ వికాసం: ఈసారైనా ఉపాధి దక్కేనా?

image

గతంలో ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తులు కోరగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఏకంగా 1.78 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.6000 కోట్లు కేటాయించింది. .. ఈసారైనా నిధులు ఖర్చు చేసి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.