News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 20, 2026

విశాఖ: నగర బహిష్కరణ చేసినా.. హత్యకు పాల్పడ్డాడు

image

విశాఖలోకి ఇసుకతోట రామాలయం వీధిలో రౌడీ షీటర్ పల్లా అనీల్ చేతిలో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడిన <<19422500>>అనీల్‌<<>>కు నేర చరిత్ర ఉండడంతో గతంలోనే పోలీసులు నగర బహిష్కరణ చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటున్నాడు. పాతకక్షల నేపథ్యంలో అనీల్ రణస్థలం నుంచి కొందరిని తీసుకువచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వెంకటేశ్ సోదరుడు సంతోష్ గాయపడి చికిత్స పొందుతున్నాడు.

News March 20, 2026

పర్యాటకానికి ‘బడ్జెట్’ ఊతం ఇచ్చేనా?

image

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ అభివృద్ధికి, భద్రాద్రి, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాల ఆధునీకరణకు సుమారు రూ. 500 కోట్లు అవసరమని అంచనా. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఇప్పుడే నిధులు కేటాయిస్తేనే ఘాట్లు, రహదారుల పనులు సకాలంలో పూర్తవుతాయి.

News March 20, 2026

ఇంద్రకీలాద్రిపై సిబ్బంది కొరత.. భక్తుల సేవలకు ఆటంకం!

image

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా, అందుకు తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. గత 20ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు, ఉన్నవారు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు సరిపోవడం లేదు. కనీసం 100 మంది కొత్త సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.