News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News March 25, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం!

TG: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ తగ్గుముఖం పట్టింది.
News March 25, 2026
2 నెలలకు సరిపడా నిల్వలున్నాయి: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోజువారీ పెట్రోల్, డీజిల్ డిమాండ్ 25% పెరిగిందని చెప్పారు. ట్యాంకర్ల ఆలస్యం కారణంగా, కొన్ని పెట్రోల్ పంపులు మూసివేశారని పేర్కొన్నారు. దేశంలో 60 రోజుల పెట్రోలియం నిల్వలు ఉన్నాయన్నారు. ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని HYD CP సజ్జనార్ తెలిపారు.
News March 25, 2026
సిద్దిపేట: ఫుల్ డే స్కూల్స్ నడిపిస్తే కఠిన చర్యలు: DEO

జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పాఠశాలలు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ డే నడుపుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ డే స్కూల్స్ నడిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


