News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 13, 2026

ఏలూరు: కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జేసీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచించారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

News March 13, 2026

అమ్రాబాద్: గవర్నర్ దంపతులకు అధికారుల ఘన స్వాగతం

image

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. శ్రీశైలం వెళ్తున్న క్రమంలో గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

News March 13, 2026

ఏలూరు: గ్యాస్ సెగ: కట్టెల పొయ్యే దిక్కు!

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత హోటల్, క్యాటరింగ్ రంగాలను అతలాకుతలం చేస్తోంది. సరఫరా నిలిచిపోవడంతో ఆర్డర్లు తీసుకోలేక నిర్వాహకులు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటకు సిద్ధమవుతున్నా, ఇంధనం దొరక్క ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ కొరతతో జిల్లాలో రెస్టారెంట్ నిర్వహణ భారంగా మారి, వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.