News November 19, 2025
HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.
Similar News
News March 15, 2026
GNT: అక్షరాంధ్ర పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లాలో నిర్వహించిన ‘ఉల్లాస్ అక్షర ఆంధ్రా’ రాత పరీక్షలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీటి సౌకర్యం ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90,426 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News March 15, 2026
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా?

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు, మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణంపై వాడీవేడి చర్చలకు ఆస్కారం ఉంది. సభకు KCR హాజరవడంపై క్లారిటీ లేదు. గతంలో సమావేశాల తొలి రోజున మాత్రమే BRS చీఫ్ హాజరయ్యేవారు.
News March 15, 2026
ADB: వ్యర్థాలతో వంటింట్లో వెలుగులు..!

జిల్లాలో పత్తి సాగు అధికం. ఏటా పంట కోత తర్వాత మిగిలే పత్తి కట్టెలను రైతులు పొలాల్లోనే తగులబెడుతుంటారు. పెరుగుతున్న గ్యాస్ ధరల నేపథ్యంలో ఈ కట్టెలే పేదలకు కొంగుబంగారంగా మారాయి. వీటిని చిన్న ముక్కలుగా చేసి ‘బ్రిక్వెట్స్’ (తెల్ల బొగ్గు)గా మార్చడం ద్వారా పొగలేని ఇంధనాన్ని పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ ఖర్చు తగ్గడమే కాక, పర్యావరణ కాలుష్యం అదుపులోకి వస్తుంది. రైతులు వీటిని అమ్మి డబ్బు సంపాదించొచ్చు.


