News November 19, 2025

స్టార్టప్‌ల కోసం ₹1000Cr ఫండ్‌: IT స్పెషల్ CS

image

TG: స్టార్టప్‌ల కోసం ₹1000 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్‌పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.

Similar News

News March 21, 2026

SLBCలో రెండు వైపులా తవ్వకాలు: ఉత్తమ్

image

TG: SLBC ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ‘ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రూల్స్ కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు.

News March 21, 2026

‘ఒత్తిడికి లొంగేది లేదు’.. అమెరికాకు శ్రీలంక షాక్!

image

అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ నిరాకరించి శ్రీలంక షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని లంక అధ్యక్షుడు దిస్సనాయకే పార్లమెంటులో వెల్లడించారు. ‘మట్టాల ఎయిర్‌పోర్టులో ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఈ నెల 4, 8 తేదీల్లో వచ్చిన 2 రిక్వెస్టులను తిరస్కరించాం. ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా మేం లొంగిపోము. మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లు విసురుతోంది. న్యూట్రల్‌గా ఉండేందుకు సాధ్యమైనదంతా చేస్తాం’ అని చెప్పారు.

News March 21, 2026

మార్చి 21: చరిత్రలో ఈ రోజు

image

1857: జపాన్‌లో భారీ భూకంపం.. 100,000 మంది మృతి
1916: షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం
1970: నటి శోభన జననం(ఫొటోలో)
1978: బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ జననం
1990: అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి మరణం
2022: రంగస్థల నటుడు, దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం
*ప్రపంచ అటవీ దినోత్సవం
*ప్రపంచ కవితా దినోత్సవం