News November 19, 2025
సంచలనం.. ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం?

ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. ఇవాళ గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ Pvt Ltd ప్రింటింగ్ ప్రెస్‌లో ATS తనిఖీలు చేసింది. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు గుర్తించింది. CCTV ఫుటేజ్, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సూసైడ్ బాంబర్ ఉమర్ 2022లో తుర్కియేకు వెళ్లి ఫారిన్ హ్యాండ్లర్ ఉకాసాను కలిసినట్లు సమాచారం.
Similar News
News November 20, 2025
NIT దుర్గాపుర్‌లో 118 నాన్ టీచింగ్ పోస్టులు

NIT దుర్గాపుర్ 18 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, BE, బీటెక్, MSc, MCA, PG, MBBS, MLSc, NET/SET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు గ్రూప్ A పోస్టులకు రూ.1500, గ్రూప్ B, C పోస్టులకు రూ.1000.
News November 20, 2025
పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(1/2)

ప్రస్తుతం రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో కోళ్లఫామ్‌ల గదుల్లో తేమ ఎక్కువగా ఉండి శిలీంద్రాలు పెరిగే ఛాన్సుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కోళ్లకు సోకి, అవి మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. ఇదే సమయంలో గాలి ప్రసరణ షెడ్‌లోకి సరిగా ఉండేలా చూసుకోవాలి.
News November 20, 2025
రూ.50లక్షలతో తీస్తే రూ.60కోట్లు వచ్చాయి!

కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు సినిమాను గెలిపిస్తారని గుజరాతీ ఫిల్మ్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’తో మరోసారి రుజువైంది. కేవలం రూ.50లక్షలతో తీసిన ఈ సినిమా తొలుత తడబడినా.. కథపై మౌత్ టాక్ పెరిగి ఇప్పటికే రూ.60కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని అంకిత్ సఖియా తెరకెక్కించగా కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. ఈచిత్రం గత నెల 10న థియేటర్లలో విడుదలైంది.


