News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

Similar News

News April 1, 2026

15 ఏళ్ల తర్వాత.. సెన్సస్-2027 ప్రారంభం

image

2011 తర్వాత దేశంలో మళ్లీ జనగణనకు వేళయింది. సెన్సస్-2027 ఇవాళ ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు నివాసాల జాబితా, గణన చేపడతారు. కేంద్రం ప్రతి రాష్ట్రానికి 30 రోజుల సమయం ఇచ్చింది. APలో మే 1-30 మధ్య, TGలో మే 11-జూన్ 9 మధ్య కొనసాగనుంది. దీనికి 15 రోజుల ముందు ప్రజలు తామే స్వయంగా ఆన్‌లైన్‌లో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా వివరాలు సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగిశాక 2027 ఫిబ్రవరిలో అసలైన జనగణన మొదలవుతుంది.

News April 1, 2026

మార్కెట్లో బుల్ జోరు!

image

పశ్చిమాసియా యుద్ధ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధర తగ్గడంతో ఇవాళ బుల్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,900 పాయింట్లు ఎగసి 73,835 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 570 పాయింట్లు లాభపడి 22,910 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News April 1, 2026

చికెన్ తింటున్నారా?

image

TGలో ఇవాళ్టి నుంచి చికెన్ షాపుల <<19529303>>బంద్<<>> కొనసాగనుంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజా చికెన్ దొరక్కపోతే నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసంపై బాక్టీరియా చేరుతుంది. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్‌వెజ్ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.