News November 19, 2025
పాలకుర్తి: స్థానిక ఎన్నికలా..? ఆ.. చూద్దాంలే..!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రజలకు “నాన్న పులి” అని తండ్రిని ఆటపట్టించే కథను గుర్తుకు తెస్తుంది. పాలకుర్తి మండలంలో నెల క్రితం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ జాబితా వచ్చి నామినేషన్ వేసే క్రమంలో ఎన్నికలు క్యాన్సిల్ అయి ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో మళ్లీ డిసెంబర్లో స్థానిక ఎన్నికలు అనే సరికి ఆ.. చూద్దాంలే అని జనం లైట్‌గా తీసుకుంటున్నారు.
Similar News
News March 12, 2026
సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.
News March 12, 2026
గరుడ వారధిపై మళ్లీ బైకులకు గ్రీన్ సిగ్నల్.!

<<19351328>>గరుడ వారధి<<>>పై ప్రమాదాల నివారణకు టూవీలర్స్, హెవీ వెహికల్స్‌ను ఆపేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి అమలు చేశారు. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి కానీ అనుమతించకపోవడం ఏంటని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి యథావిధిగా గరుడ వారధిపై బైకులు వెళ్తున్నాయి.
News March 12, 2026
పది పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో భోజన్న

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47 కేంద్రాల్లో 9,750 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 4,786 మంది బాలురు, 4,964 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


