News November 19, 2025

గోదావరిఖని: 10 STATES.. 16 Days.. 4000 KMల సైక్లింగ్ రైడ్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని FIT INDIAలో భాగంగా కశ్మీర్ TO కన్యాకుమారి వరకు A RIDE FOR UNITY పేరిట సైక్లింగ్ రైడ్ చేపట్టారు. 3000 మంది అప్లై చేసుకోగా 150 మందిని ఎంపిక చేశారు. సింగరేణి OCP 5 EP ఆపరేటర్ వెంకట తిరుపతి రెడ్డికి కూడా ఇందులో అవకాశం దొరికింది. 10 STATES.. 16 DAYS.. 4000 KMల సైక్లింగ్ రైడ్లో పాల్గొన్నారు. ఇది తనకు అద్భుత అనుభూతిని ఇచ్చిందని తిరుపతి రెడ్డి తెలిపారు.

Similar News

News March 16, 2026

షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

image

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్‌లైన్‌లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్‌ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.

News March 16, 2026

‘చిన్న కాళేశ్వరం’కు ఈసారైనా మోక్షం లభించేనా?

image

నేటి నుంచి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి 2026-27 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మన మంథని నియోజకవర్గ ప్రజల చూపు రాష్ట్ర బడ్జెట్‌పై పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న (ముక్తేశ్వర) ఎత్తిపోతలకు ఈ బడ్జెట్లోనైనా నిధుల మోక్షం లభిస్తుందా? లేదా గత బడ్జెట్ల మాదిరిగానే మొండిచేయి చూపుతారా? అనే ఆందోళన నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది.

News March 16, 2026

సిద్దిపేట: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు:కలెక్టర్

image

సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికల భద్రత విషయంలో రాజీ పడొద్దని, కామన్ డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్లను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.