News November 19, 2025

JMKT: ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు.. రేపు మార్కెట్‌కు సెలవు

image

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నాలుగు రోజుల విరామం తర్వాత బుధవారం ప్రారంభం కాగా ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు రైతులు 351 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,090, కనిష్ఠంగా రూ.6,000 ధర పలికింది. అలాగే గోనె సంచుల్లో వచ్చిన 14 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,600 ధర లభించింది. గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.

Similar News

News March 17, 2026

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News March 15, 2026

KNR: ‘స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

image

స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డా.బీఎన్.రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది తప్ప ఉత్తమ ఉద్యోగ పాలసీని తయారు చేయలేక పోతున్నారని విమర్శించారు.

News March 15, 2026

కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

image

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.