News November 19, 2025

DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు

image

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES) 38 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత‌గల వారు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/

Similar News

News March 23, 2026

షెడ్యూల్ ప్రకారమే IPL మ్యాచులు: అధికారి

image

ఈ నెల 28 నుంచి IPL షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని లీగ్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఫారిన్ ప్లేయర్లు పాల్గొంటారా లేదా అనేది ఫ్రాంచైజీలు చూసుకుంటాయని, ఆ నిర్ణయం వారిదేనని తెలిపారు. వర్క్‌లోడ్, గాయాల వల్ల కొందరు ఇంకా ఆయా జట్లలో చేరలేదని పేర్కొన్నారు. కాగా తమ దేశాల క్రికెట్ బోర్డుల నుంచి NOC రాలేదని స్టార్క్ సహా పలువురు ఆటగాళ్లు ఇంకా IPL <<19429037>>టీమ్‌లలో<<>> చేరని సంగతి తెలిసిందే.

News March 23, 2026

త్వరలో రష్యా పర్యటనకు మోదీ!

image

ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇండియా, రష్యా మధ్య జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో లావ్రోవ్ మాట్లాడారు. రెండు దేశాలది కాల పరీక్షకు నిలిచిన స్నేహమని కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో రెండు రోజులపాటు ఇండియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ <<18475772>>పర్యటించడం<<>> తెలిసిందే.

News March 23, 2026

CGD నెట్వర్క్‌తో ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

image

AP: LPG కొరత నేపథ్యంలో ఇళ్లకు, వ్యాపారాలకు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) పంపిణీకి GOVT చర్యలు చేపట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు GO జారీచేసింది. PNG సరఫరాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు విధివిధానాలను నిర్దేశించింది. పైప్ లైన్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అనుమతులు వంటివి వేగంగా పూర్తయ్యేలా గడువు విధించింది. ఇందుకు వివిధ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది.