News November 19, 2025

అర్హులైన మహిళలందరికీ చీరలు అందాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో వీసీ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో, సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హత గల మహిళకు చీర అందేలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పంపిణీ చేయాలని సూచించారు.

Similar News

News March 21, 2026

విశాఖ: డొమెస్టిక్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ జోరు

image

విశాఖ జిల్లాలో ఎల్పీజీ కొరత తీవ్రంగా మారింది. చిరు వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్‌లో రూ.2000-2500లకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 20 నాటికి 1.16 లక్షల సిలిండర్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 62 గ్యాస్ ఏజెన్సీలు, 8.95 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హెచ్పీసీఎల్, ఐఓసీ బాటిలింగ్ యూనిట్ల వద్ద ప్రభుత్వం పర్యవేక్షణ అధికారులను నియమించింది.

News March 21, 2026

Wah.. నగరమంతా నోరూరించే సువాసన

image

రంజాన్ అనగానే షీర్ ఖుర్మా గుర్తొస్తుంది. నగరమంతా దీని గుమగుమలతో నిండిపోతుంది. గల్లీల్లో దోస్తులందరినీ ఇంటికి పిలిచి దావత్‌ ఇచ్చి ఆఖరున షీర్ ఖుర్మాతో నోరు తీపి చేస్తారు. ఈ షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలను బాగా మరిగించి ఖర్జూరాల తీపితో చేసే ఈ డెజర్ట్ తక్షణ శక్తినిస్తుంది. దీంట్లోని కాల్షయం, ప్రోటీన్లు ఎముకలను బలపరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణుల మాట.

News March 21, 2026

6న అనంతపురం JNTU స్నాతకోత్సవం

image

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నట్లు వీసీ హంచాటే సుదర్శన రావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలను అందజేస్తామన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఛాన్స్‌లర్ హోదాలో స్నాతకోత్సవాన్ని హాజరుకానున్నారు.