News November 19, 2025
అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు శరవేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. వాడరేవు-చిలకలూరిపేట 167ఏ జాతీయ రహదారి నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. చీరాల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయితే రహదారి నిర్మాణం ముగుస్తుందని గుత్తేదారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు
Similar News
News March 22, 2026
GK: ప్రపంచంలో అతి చిన్నవి

⋆ సముద్రం: ఆర్కిటిక్ (విస్తీర్ణం 14.05M చ.కి.మీ)
⋆ దేశం: వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ వైశాల్యం)
⋆ ఖండం: ఆస్ట్రేలియా (7.7-8.6M చ.కి.మీ వైశాల్యం)
⋆ పక్షి: బీ హమ్మింగ్‌బర్డ్ (5-6cm పొడవు, 2gms కంటే తక్కువ బరువు)
⋆ నది: US మాంటానాలో ఉన్న’రో’ నది (పొడవు 61m)
⋆ అతి చిన్న పుష్పం గల చెట్టు: ఉల్ఫియా ఆంగుస్టా
➜ రోజూ సా.5 గంటలకు GK బిట్స్
News March 22, 2026
కావలి: ఆ బోట్ల విడుదల వెనకున్న నేత ఎవరు..?

కొన్ని నెలల నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్న ఆ బోట్లను విడిపించడంలో కీలకంగా వ్యవహరించిన నేత ఎవరు? ఆయనకు దాని వలన వచ్చే లాభం ఏమిటనేది ప్రస్తుతం జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో ఎంపీ బీద మస్తాన్ రావు వీడియో షేర్ చేసి క్లారిటీ ఇవ్వగా.. ఇంత గొడవ జరిగినా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించలేదని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల తీర ప్రాంత సమస్య కావడంతో ఈ విషయం సమస్యాత్మకంగా మారుతోంది.
News March 22, 2026
నర్మెట: లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి: మంత్రి తుమ్మల

కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నర్మెటలో జరుగుతున్న రైతు సదస్సులు మాట్లాడారు. ‘లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి. మనకు అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన అన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్దిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నామన్నారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు.


