News November 19, 2025
NRPT: 3వ జిల్లా మహా సభలు విజయవంతం చేయాలి

జిల్లా కేంద్రంలో జరిగే PDSU జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. మహా సభల వాల్ పోస్టర్లను బుధవారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22, 23 రెండు రోజులు మహా సభలు జరుగుతాయని, విద్యార్థులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నేతలు పాల్గొన్నారు.
Similar News
News March 15, 2026
నెల్లూరు: మహిళా కండక్టర్‌కు HIV ఉందంటూ అవమానం!

నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరిలో అవమానించి, HIV ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి వైద్యురాలిని మందలించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని బాధితురాలు తెలిపారు.
News March 15, 2026
జనగణనకు 76వేల మంది టీచర్లు

TG: మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలిదశ <<19385989>>జనగణనకు<<>> 76వేల మంది టీచర్లను వినియోగించుకుంటామని సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్పారు. పనితీరును పరిశీలించేందుకు ప్రతి 6-7 మంది ఎన్యూమరేటర్లకు ఓ సూపర్ వైజర్, రాష్ట్రవ్యాప్తంగా 762 మంది ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. పౌరులే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు APR 26-మే 10 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్/యాప్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
News March 15, 2026
ఉమ్మడి విశాఖలో జనసేనకు సభ్యత్వ కష్టాలు..

ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయిలో జరగడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, టీడీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నమోదు కార్యక్రమం సరిగ్గా జరగడం లేదని నాయకులు అంటున్నారు. ప్రధానంగా స్థానిక నాయకులు ముందుకు రాకపోవడం, రూ.500 ఫీజు ఉండటం సభ్యత్వాలకు అడ్డంకిగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.


