News November 19, 2025

చింతూరు: ఆడుతూ స్పృహ తప్పి చిన్నారి మృతి

image

చింతూరు మండలం కుయుగూరులో చిన్నారి శ్యామల జనని(5) బుధవారం ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. బాలిక తోటి పిల్లలతో అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ దారిలో ఉన్న రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.

Similar News

News March 12, 2026

సత్తుపల్లి: ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

సత్తుపల్లి(M) నారాయణపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు(58), పెనుబల్లి(M) పానెం సులోమన్(57) వేర్వేరు బైక్‌లపై సత్తుపల్లి వైపు వస్తుండగా.. బేతుపల్లి నుంచి వస్తున్న లారీ టర్నింగ్ వద్ద వీరిని బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News March 12, 2026

తిరుపతి: ఇంటర్ పరీక్షలకు 313 మంది గైర్హాజరు

image

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,973మంది విద్యార్థులకు గాను 4,660 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 313 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.

News March 12, 2026

రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలి: కోలీవుడ్

image

తమిళ దిగ్గజ నటుడు MGRపై ఇటీవల రాజేంద్రప్రసాద్ చేసిన వివాదాస్పద <<19346659>>వ్యాఖ్యలపై<<>> కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళ ఆరాధ్య దైవాన్ని కించపరచడం తగదని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రముఖ యాక్టర్స్ నాజర్, విశాల్ డిమాండ్ చేశారు. కాంతారావు గొప్ప నటుడని, కానీ ఆయన్ని పొగిడే క్రమంలో మరో యాక్టర్‌ను తక్కువ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.