News November 19, 2025
హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టు!

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా నిన్న ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడం తెలిసిందే. అయితే ఆయన అనుచరుడు మద్వి సరోజ్ కోనసీమ(D) రావులపాలెంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు అరెస్టు చేశారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారని సమాచారం. కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చాడు? ఎప్పటినుంచి ఉంటున్నాడు? తదితరాలపై ఆరా తీస్తున్నారు.
Similar News
News March 12, 2026
కవిత ఇంటికి సీబీఐ అధికారులు

TG: మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చారు. భర్త అనిల్ నోటీసులు తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఇటీవల ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. కాగా, న్యాయస్థానం నోటీసులను నేడు అధికారులు ఆమెకు అందజేశారు. 16న విచారణకు హాజరు కావాలని తెలిపారు.
News March 12, 2026
ఇది కదా రష్యా అంటే..

భారత్‌పై రష్యా మరోసారి తన గౌరవాన్ని చాటుకుంది. రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు తాత్కాలికంగా <<19351259>>పర్మిషన్<<>> ఇచ్చామన్న అమెరికా వ్యాఖ్యలపై మన దేశంలోని రష్యా రాయబారి అలిపోవ్ స్పందించారు. ‘మా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు ఏ దేశ పర్మిషన్ అవసరం లేదు. అమెరికా అధికారులు తమ అసలు రంగును మరోసారి బయటపెట్టారు. అమెరికా ఇతర దేశాలను భాగస్వాములుగా కాకుండా తక్కువస్థాయి దేశాలుగా చూస్తుంది’ అని తెలిపారు.
News March 12, 2026
కిడ్నీలను కాపాడుకుందామా!

నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించాలి. బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. SHARE IT


