News November 19, 2025
నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్‌గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.
Similar News
News March 5, 2026
విశాఖ భూగర్భంలో రెడీగా మిలియన్ టన్నుల చమురు!

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. అయితే ఇంధన సంస్థల నిల్వలతో పాటు విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరులో అండర్‌గ్రౌండ్‌లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ అంటారు. 2015లో ఫేజ్-1 లాంచ్ కాగా మరిన్ని ఏర్పాటుకానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు వీటిని తీసుకొచ్చారు.
News March 5, 2026
ఫైనల్‌కు ఒక్క అడుగుదూరంలో..

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్‌తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్‌లో భారత్‌దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్‌ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News March 5, 2026
నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్‌తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.


