News November 19, 2025

కగార్ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

image

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.

Similar News

News November 21, 2025

బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

image

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.

News November 21, 2025

BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

నిర్మల్‌ ఏఎస్పీగా సాయికిరణ్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.