News November 19, 2025

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. కడప(D) పెండ్లిమర్రి సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. తానూ రైతు బిడ్డనే అని, నాన్నకు వ్యవసాయంలో సాయం చేసేవాడినని వెల్లడించారు. అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టే అన్నదాత సుఖీభవ కింద రూ.14వేలు అందజేశామని పేర్కొన్నారు. సాగు తీరు మారి, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పంచసూత్రాలను అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News April 2, 2026

ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: ఇరాన్

image

సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ అభ్యర్థించిందన్న <<19538873>>ట్రంప్<<>> వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. అవన్నీ అబద్ధమని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది. దేశంలో అధికార మార్పిడి జరగలేదని, పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారని పేర్కొంటూ ట్రంప్ పోస్ట్‌ను కొట్టిపారేసింది.

News April 2, 2026

చంద్రుడి చెంతకు మళ్లీ మనిషి.. రేపే పయనం

image

దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవులను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు నాసా ఆర్టెమిస్-II మిషన్‌ సిద్ధమైంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ 10 రోజుల జర్నీ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఏప్రిల్ 2న 3:54 AMకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది. ఓరియన్ వ్యోమనౌకలో వెళ్లే ఈ బృందం చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగేందుకు అవసరమైన టెక్నాలజీని పరీక్షిస్తుంది.

News April 2, 2026

NDA గెలిస్తే తమిళనాడు పేరును మారుస్తారు: స్టాలిన్

image

తమిళనాడు ఎన్నికల్లో NDA గెలిస్తే రాష్ట్రం పేరును దక్షిణ ప్రదేశ్‌గా మారుస్తారని CM స్టాలిన్ ఆరోపించారు. ఆ కూటమికి వ్యతిరేకంగా ఏకం కావాలని తిరుచ్చి సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బీజేపీ డమ్మీ ఇంజిన్ ముందు ద్రవిడ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ ఎప్పటికీ తలవంచదు. దేశం మొత్తంలో తమిళనాడులోనే అధిక సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు. BJP పాలిత రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ అఘాయిత్యాలు జరగవు’ అని పేర్కొన్నారు.