News November 19, 2025
GNT: 26న జెడ్పీ స్థాయి సంఘ సమావేశం

జిల్లా పరిషత్ 6వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి. జ్యోతిబాసు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్‌లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్ అనురాధ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం జరుగుతుందన్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.
Similar News
News March 5, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని BC సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని గురువారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News March 5, 2026
GNT: ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని, సివిల్ కేసులు, క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, చెక్ బౌన్స్, LOAP కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు, స్టేక్హోల్డర్స్, పోలీసులు కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు.
News March 4, 2026
జీజీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రభుత్వ వైద్యశాల అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నైట్ షిప్ట్‌లలో విధులు నిర్వహించే విభాగాల వైద్యులు, క్యాజువాలిటి, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.


