News November 19, 2025
వరంగల్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి: మేయర్ సుధారాణి

వరంగల్ నగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను మేయర్ శాలువాలతో సత్కరించారు.
Similar News
News March 24, 2026
IPL: రహానేకు అతి తక్కువ జీతం..

IPL- 2026లో జీతాల పరంగా కెప్టెన్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. LSG కెప్టెన్ పంత్ ₹27 కోట్లతో అత్యధిక జీతం తీసుకుంటున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు KKR కెప్టెన్ అజింక్యా రహానే ₹1.5 కోట్లు మాత్రమే అందుకుంటున్నారు. ఈ సీజన్‌లో అత్యంత తక్కువ జీతం తీసుకుంటున్న సారథి ఈయనే. కాస్ట్లీ ప్లేయర్ల కంటే అనుభవానికే KKR ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ ‘లో బడ్జెట్’ కెప్టెన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
News March 24, 2026
ఆదాయ పెంపులో జిల్లాను ముందంజలో నిలపాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత వార్షిక లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేసి గత ఆర్థిక సంవత్సరాన్ని మించి లక్ష్యాలను అధిగమించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.