News November 19, 2025
NRPT: ఆరోగ్య బీమా జీవితానికి ధీమా

ఆరోగ్య బీమా చేసుకోవడం ద్వారా జీవితానికి ధీమా లభిస్తుందని అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో హోం గార్డులకు ప్రైవేట్ బ్యాంకుల ఆధ్వర్యంలో బీమాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగిన, ప్రమాదవశాత్తు మృతి చెందిన నష్టపరిహారం అందుతుందని చెప్పారు. ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 6, 2026
పాలకొల్లు: నైట్ యాక్సిడెంట్.. చికిత్స పొందుతూ హోమ్‌గార్డు మృతి

పాలకొల్లు మండలం ఉల్లంపర్రు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు <<19578295>>రఘుమండ వెంకటరమణ<<>>(56) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పోడూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆదివారం రాత్రి బైకుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను తొలుత పాలకొల్లు, అనంతరం భీమవరం అక్కడి నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News April 6, 2026
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.
News April 6, 2026
త్వరలో సినిమాలకు త్రిష గుడ్‌బై?

TVK చీఫ్, హీరో విజయ్‌తో రిలేషన్‌పై రూమర్స్ నడుస్తున్న వేళ నటి త్రిషపై సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌పై చెప్పే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రేమ గురించి ఆమె ఇటీవల <<19575762>>ఇన్‌స్టాలో<<>> షేర్ చేసిన పోస్ట్‌తో ఇది మొదలైంది. ఇక రీసెంట్‌గా ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకపోవడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. అయితే దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది.


