News November 19, 2025

హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

image

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి: రేపు ఏమేం చేయాలో తెలుసా?

image

పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

News November 20, 2025

AVNLలో 133 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)లో 133 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. Jr టెక్నీషియన్, Environ. Eng, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్, BSc(ENG.), డిగ్రీ, PG, MBA, PGBDM, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు NTC/NACగల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News November 20, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. ఇవాళ చైనీస్ తైపీకి చెందిన గువాయి గ్జువాన్‌తో అమీతుమీ
* బధిర ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో ఇప్పటివరకు 11 పతకాలు సాధించిన భారత షూటర్లు
* టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్-2026’కు ఎంపికైన దిగ్గజ ప్లేయర్ ఫెదరర్
* ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో లక్ష్య సేన్, ప్రణయ్
* ఝార్ఖండ్‌తో రంజీ మ్యాచులో ఆంధ్ర విజయం