News November 19, 2025
గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
Similar News
News March 14, 2026
తెనాలిలో ఇనుప చట్రంతో పొట్టి శ్రీరాములు అద్భుత విగ్రహం

తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఈ నెల 16న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2 టన్నుల ఐరన్ స్ర్కాప్‌తో తయారు చేసిన విగ్రహాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి సభ్యులు తోటకూర రమణారావు, బీసీ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు విగ్రహాన్ని తిలకించి శిల్పులను అభినందించారు.
News March 14, 2026
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: గుంటూరు ఎస్పీ

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SSS పరీక్షల కోసం గుంటూరు జిల్లాలో 149 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా SP వకుల్ జిందాల్ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు ఉండగా, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News March 14, 2026
అమరావతిలో స్థలం ఇస్తే స్టూడియో నిర్మిస్తాం: దిలీప్ రాజా

అమరావతిలో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వానికి మనవి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సినిమా షూటింగ్‌లకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. సినిమా షూటింగ్‌లకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని, దీనిపై స్పందించాలని కోరారు.


