News November 19, 2025

సంగారెడ్డి: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పీ

image

పోలీస్ సిబ్బందికి పంపిణీ చేసే గ్యాస్ ఆటోను ఎస్పీ పారితోష్ పంకజ్ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసు సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్యాస్ ఆటో ద్వారా త్వరగా సిలిండర్ అందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TGలో రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగతా చోట్ల సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 22-24 మధ్య అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

News November 19, 2025

సంగారెడ్డి: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ వంటి కీలక ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, నిమ్జ్ ప్రత్యేక అధికారిని విశాలాక్షి పాల్గొన్నారు.

News November 19, 2025

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అక్రిడియేషన్ కార్డుల జాప్యం, జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ అమలు చేయకపోవడం, పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు.