News November 19, 2025

17వ వార్షికోత్సవంలోకి ట్రూ జోన్ సోలార్

image

తెలంగాణకు చెందిన పాన్-ఇండియా సోలార్ కంపెనీ అయిన ట్రూజోన్ సోలార్ (సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్) బుధవారంతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా ట్రూజోన్ దేశంలోని అత్యంత విశ్వసనీయ సోలార్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. కస్టమర్-ఫస్ట్ విధానంతో ట్రూజోన్ సోలార్ భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది.

Similar News

News November 19, 2025

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌ శిల్పారామంలో కళాకారులు కూచిపూడి నృత్యప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. బుధవారం గురువు సుప్రియ శిష్యబృందం జయము జయము, శ్రీరంగనాథం, ముద్దుగారే యశోద, ఓం శర్వాణి, జయజయ దుర్గే, అన్నమాచార్య కీర్తనలు, శ్యామల మీనాక్షి, సీతా కళ్యాణం తదితర అంశాలను ప్రదర్శించారు. కళాకారులు చైత్ర, రూప, హరిణి, రిషిత, సమీక్షిత, శ్రీనిక, ప్రమీత, దక్ష, యుక్తశ్రీ, మోక్షిత పాల్గొన్నారు.

News November 19, 2025

HYD: సంస్థ అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరం: సీపీ

image

ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరమని సీపీ సజ్జనార్ అన్నారు. ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, ఈ శిక్షణ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు.

News November 19, 2025

HYD: శంషాబాద్‌లో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన HYD శంషాబాద్‌లో ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వర్ధమాన్ కాలేజీలో చదువుతున్న రోహిత్(21), రామటెంకి సిద్ధార్థ(21) మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా శంషాబాద్ పరిధి నర్కుడ గ్రామంలో ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధార్థ అక్కడికక్కడే మరణించగా తీవ్రగాయాలైన రోహిత్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.